ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఆప్‌ సంపూర్ణ మద్దతు

ABN, First Publish Date - 2022-05-17T06:04:32+05:30

విశాఖ ఉక్కు పరిరక్షణకు తమ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌.మణి నాయుడు అన్నారు.

రిలే దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న ఆర్‌.మణి నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌.మణి నాయుడు 

కూర్మన్నపాలెం, మే 16: విశాఖ ఉక్కు పరిరక్షణకు తమ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌.మణి నాయుడు అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 459వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ శిబిరంలో  పాల్గొన్న సీఎంఎం, సీఎంఈ, టెలికాం కార్మికులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మణి నాయుడు మాట్లాడుతూ గత పార్లమెంట్‌ సమావేశంలో తమ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ విశాఖ ఉక్కు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు.  ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ వర ప్రసాద్‌ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో ఆప్‌ నాయకులు నారాయణరావు, డాక్టర్‌ శీతల్‌, రాజు, కృష్ణమూర్తి, నాగూర్‌, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, అయోధ్యరామ్‌, వరసాల శ్రీనివాసరావు, గంధం వెంకటరావు, పరందామయ్య, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-17T06:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising