ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-12-31T01:23:40+05:30
ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి సూచించారు. ఇక్కడి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఆధార్ మోనటరింగ్ కమిటీ అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అనకాపల్లి కలెక్టరేట్, డిసెంబరు 30 : ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి సూచించారు. ఇక్కడి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఆధార్ మోనటరింగ్ కమిటీ అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్‌ను 2010 అక్టోబరు నుంచి 2015 మధ్య నమోదు చేసుకున్న వారు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలన్నారు. వీరికే ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు కొత్తగా అప్డేట్ చేసుకోవాలని, మరలా పదిహేను సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో పి.వెంకటరమణ, ఆధార్ ప్రాజెక్టు మేనేజర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T01:23:41+05:30 IST