ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగుతుని పాఠశాల సందర్శన

ABN, First Publish Date - 2022-08-04T07:02:41+05:30

మం డలంలోని ఏనుగుతుని ఎంపీ యూపీ పాఠశాలను ఎంపీపీ కలగా లక్ష్మి, ఎంపీడీవో కొంకి అప్పారావు, ఎంఈవో దివాకర్‌ బుధవారం పరిశీలించారు

పాఠశాల గదిని పరిశీలిస్తున్న ఎంపీపీ, ఎంపీడీవో, ఎంఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 కశింకోట, ఆగస్టు 3 : మం డలంలోని ఏనుగుతుని ఎంపీ యూపీ పాఠశాలను ఎంపీపీ కలగా లక్ష్మి, ఎంపీడీవో కొంకి అప్పారావు, ఎంఈవో దివాకర్‌ బుధవారం పరిశీలించారు. ‘బడిలో కూలిన శ్లాబ్‌ పెచ్చులు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి వెనువెంటనే స్పందిం చారు. ఈ సందర్భంగా శ్లాబ్‌ పెచ్చు లూడిన తరగతి గదిని వారు పరిశీలించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. 1998లో నిర్మించిన ఈ భవనానికి నాడు- నేడు పనుల్లో భాగంగా  శ్లాబుకు సీలింగ్‌ వేశారు. ఈ సీలింగ్‌ శ్లాబుకు సరిగా అతుక్కోకపోవడంతో ఏడాది కాకముందే పెచ్చులు ఊడిపోయాయని స్థానికులు తెలిపారు. ఈ విషయమై ఎంఈవోను వివరణ కోరగా, నాడు-నేడులో భాగంగా మరమ్మతు పనులు జరిగేటప్పుడు నాణ్యత పరిశీలనకు సంబంధించి సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ తీసుకున్న సమాచారం, అప్పుడు పనిచేసిన హెచ్‌ఎం నుంచి నివేదిక,  ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు ఈ మూడు రిపోర్టులను డీఈవోకు సమర్పించానని చెప్పారు. డీఈవో ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో చెప్పారు. ఏఈ రామావతారం, సర్పంచ్‌ కొప్పాక నాగమణి, పేరెంట్స్‌ కమిటీ చైర్మన్‌ మారిశెట్టి సూర్యప్రకాష్‌, మాజీ చైర్మన్‌ రాయి అప్పలరాజు, పాల సంఘం అధ్యక్షుడు కరణం బాబూజీ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T07:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising