ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు చేరిన 7 పశువుల అంబులెన్స్‌లు

ABN, First Publish Date - 2022-05-22T06:56:40+05:30

పశువుల ఆరోగ్యానికి భద్రత, భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అమలు చేస్తున్నదని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ డి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మే 21: పశువుల ఆరోగ్యానికి భద్రత, భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అమలు చేస్తున్నదని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ డి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాడి రైతులకు, పశు పెంపకందారులకు పశువుల అంబులెన్స్‌ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాకు కేటాయించిన 7 పశువుల అంబులెన్సులు శుక్రవారం చేరాయని, టోల్‌ ఫ్రీ నంబరు 1962 ద్వారా వీటి సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రైతులు ఈ అంబులెన్స్‌ల సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. పాడి రైతులు, పశు పెంపకందారులకు వారి ఇంటి వద్దనే పశు వైద్య సేవలు అందుతాయని, అంబులెన్స్‌లో పశువైద్యుడు, వెటర్నరీలో డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కం అటెండర్‌ ఉంటారని వివరించారు. ఇందుకు సంబంధించిన ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరించి పశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-22T06:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising