జిల్లాలో 31185 మందికి జగనన్న తోడు లబ్ధి
ABN, First Publish Date - 2022-08-04T05:45:22+05:30
3: జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 31,185 మంది లబ్ధిదారులకు రూ.31.18 కోట్లు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
మహారాణిపేట, ఆగస్టు 3: జగనన్న తోడు పథకం ద్వారా జిల్లాలో 31,185 మంది లబ్ధిదారులకు రూ.31.18 కోట్లు లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. 2022 వ సంవత్సరానికి జగనన్న తోడు పథకం లబ్ధిదారులకు రుణ సహాయం చేసే కార్యక్రమం బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ఆన్‌లైన్‌లో వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రుణ సాయం సక్రమంగా చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ మాఫీ కింద మొత్తం 34749 మందికి రూ.61.67 లక్షలు జమచేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన కూరగాయలు, వస్త్ర వ్యాపార స్టాల్స్‌ను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రవీంద్ర బాబు, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ ఎ.విజయనిర్మల, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T05:45:22+05:30 IST