‘చలో ఆంధ్ర యూనివర్సిటీ’...విశాఖలో పోలీస్ బందోబస్తు
ABN, First Publish Date - 2022-03-03T16:26:56+05:30
‘‘చలో ఆంధ్ర యూనివర్సిటీ’’ అఖిలపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం: ‘‘చలో ఆంధ్ర యూనివర్సిటీ’’ అఖిలపక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. వీసీ ప్రసాద్ రెడ్డిని తక్షణమే రీకాల్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అఖిలపక్షం నాయకులు, విద్యార్థి సంఘాలు నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. అలాగే ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2022-03-03T16:26:56+05:30 IST