ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై తప్ప తాగి.. ఏఎ్‌సఐని తన్ని..

ABN, First Publish Date - 2022-12-16T02:10:28+05:30

బుధవారం అర్ధరాత్రి. విశాఖ బీచ్‌రోడ్డులో ఓ యువతి బైక్‌పై కూర్చుని మద్యం, సిగరెట్‌ తాగుతూ రోడ్డుపై వీరంగం సృష్టించింది. అడ్డుకున్న పోలీసులను బూతులు తిడుతూ.. ఏఎ్‌సఐని కాలుతో తన్ని శివాలెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖలో అర్ధరాత్రి వివేళ యువతి వీరంగం

విశాఖపట్నం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): బుధవారం అర్ధరాత్రి. విశాఖ బీచ్‌రోడ్డులో ఓ యువతి బైక్‌పై కూర్చుని మద్యం, సిగరెట్‌ తాగుతూ రోడ్డుపై వీరంగం సృష్టించింది. అడ్డుకున్న పోలీసులను బూతులు తిడుతూ.. ఏఎ్‌సఐని కాలుతో తన్ని శివాలెత్తింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసిన స్టేషన్‌కు తరలించారు. త్రీటౌన్‌ సీఐ కె.రామారావు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్‌ డెయిరీ ఫారం ప్రాంతానికి చెందిన యువతి బుధవారం అర్ధరాత్రి వేళ ద్విచక్ర వాహనంపై బీచ్‌రోడ్డుకు వెళ్లింది. కురుపాం సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైక్‌ పార్క్‌ చేసి అక్కడే మద్యం తాగడం మొదలెట్టింది. రోడ్డుపై నిల్చుని వాహనాలకు ఇబ్బంది కలిగిస్తుండడంతో కొంతమంది డయల్‌ 100కి సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎ్‌సఐ సత్యనారాయణ, మరొక కానిస్టేబుల్‌ అక్కడకు వెళ్లారు. వైఎంసీఏ వద్ద కనిపించిన యువతికి బ్రీత్‌ అనలైజర్‌తో తనిఖీ చేయగా 149 రీడింగ్‌ వచ్చింది. ఆమె వివరాలు తీసుకుని.. ఉదయం స్టేషన్‌కు వచ్చి బైక్‌ తీసుకువెళ్లాలని చెప్పారు. దీంతో ఆ యువతి రెచ్చిపోయింది. ఏఎ్‌సఐపైకి బీర్‌బాటిల్‌ విసిరింది. అది ఏఎ్‌సఐ పక్కనే ఉన్న గోవింద్‌ అనే యువకుడికి తగిలి, అతని ఎడమ కంటి వద్ద గాయమైంది. ఆ యువతి మరింత రెచ్చిపోయి.. ఏఎ్‌సఐను కాలితో పొట్టలో బలంగా తన్నింది. స్థానికుల సహాయంతో పోలీసులు ఆమెను త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై సెక్షన్‌ 353, 427 ఐపీసీతోపాటు సెక్షన్‌ 184, 185 ఎంవీయాక్ట్‌ కింద కేసు నమోదుచేశారు. కోర్టుకు హాజరుపరచగా రెండు వారాలు రిమాండ్‌ విధించింది.

Updated Date - 2022-12-16T02:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising