ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన

ABN, First Publish Date - 2022-08-04T08:22:32+05:30

న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌పై కేసు

మదనపల్లె క్రైం, ఆగస్టు 3: న్యాయస్థానం ఆదేశాల ను ఉల్లంఘించి.. ఇంటిని రిజిష్టర్‌ చేసిన అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ సహా ఆరుగురిపై అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన మాదిన భాస్కర్‌ 2014లో దిగువ కురవంకకు చెందిన జేఎం షరీఫ్‌ ఇంటిని రూ.16 లక్షలకు కొనుగోలు చేశాడు. షరీఫ్‌ ఆ ఇంటిని భాస్కర్‌కు రిజిష్టర్‌ చేయలేదు. ఆతర్వాత షరీఫ్‌ మరణించాడు. ఈ క్రమంలో భాస్కర్‌ అప్పట్లో ఇంటి వద్ద స్థలాన్ని శుభ్రం చేస్తుండగా, షరీఫ్‌ కుటుంబ సభ్యులు గొడవ పెట్టుకుని కులం పేరుతో దూషించారు. దీనిపై బాధితుడు మదనపల్లెలోని అడిషనల్‌ డిస్ర్టిక్ట్‌ జడ్జి కోర్టు ను ఆశ్రయించాడు. ఆ ఇంటిని ఇతరులకు రిజిష్టర్‌ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో షరీఫ్‌ కుమారుడు నజీర్‌ అహ్మద్‌  తన కుమారుడు గౌస్‌ ఆజాం పేరు మీద ఆ ఇంటిని రిజిష్టర్‌ చేశాడు. దీనిపై కోర్టు ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ రాజు, రైటర్‌ నవీన్‌లపై కేసు పెట్టారు.

Updated Date - 2022-08-04T08:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising