ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ సచివాలయాలు శుద్ధ దండగ

ABN, First Publish Date - 2022-10-28T03:01:41+05:30

ప్రజలకు సేవ చేయలేని సచివాలయ వ్యవస్థ మనకెందుకు? మీసేవా కేంద్రాల ద్వారా పనులు చక్కగా జరిగాయి. సచివాలయాలు శుద్ధ దండగ. సచివాలయాల వ్యవస్థ వచ్చాక రైతులకు పట్టాదారు పాసుపుస్తకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ పాలనలో ఏ పనీ కావడంలేదు

ప్రజలకు ముఖం చూపించలేక పోతున్నాం

వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఆవేదన

లక్కవరపుకోట, అక్టోబరు 27: ‘ప్రజలకు సేవ చేయలేని సచివాలయ వ్యవస్థ మనకెందుకు? మీసేవా కేంద్రాల ద్వారా పనులు చక్కగా జరిగాయి. సచివాలయాలు శుద్ధ దండగ. సచివాలయాల వ్యవస్థ వచ్చాక రైతులకు పట్టాదారు పాసుపుస్తకం కూడా ఇప్పించలేకపోతున్నాం’.. ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు. వైసీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఆగ్రహం. గురువారం జరిగిన విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల పరిషత్‌ సమావేశంలో ‘అంతా సొంత పార్టీ వాళ్లమే. కానీ జగన్‌ పాలనలో ఏ పనీ చేయలేక పోతున్నాం’ అని వైసీపీ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. వైసీపీకి చెందిన మల్లివీడు సర్పంచ్‌ ఆదిరెడ్డి అర్జున, రేగిడి ఎంపీటీసీ గణపతి తదితరులు మాట్లాడుతూ ప్రజల పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. ఇప్పటివరకు చేసిన పనులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని గేదెలవాణిపాలెం, మల్లివీడు, రేగ, చందులూరు, గంగుబూడి ప్రతినిధులు మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయలేని సచివాలయ వ్యవస్థ మనకెందుకని మల్లివీడు సర్పంచ్‌ అర్జున ప్రశ్నించారు.

Updated Date - 2022-10-28T03:01:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising