ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: పార్కులు తాకట్టు పెట్టిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-02-11T16:50:53+05:30

పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం.. అప్పు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం.. అప్పు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టిన సర్కార్ తాజాగా విజయవాడలోని విలువైన పార్కులపై కన్నేసింది. అభివృద్ధి పేరుతో పార్కు స్థలాలను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటోంది. బెజవాడలో సుందరమైన బెర్మ్ పార్కును పర్యాటక అభివృద్ధి సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టింది. ఐదెకరాల విస్తీర్ణం కలిగిన ఈ పార్కును తనఖా పెట్టి రూ. 143 కోట్లు అప్పుగా తీసుకుంది. నాలుగైదు రోజుల్లో తొలివిడతగా రూ. 35 కోట్లు విడుదల కానున్నాయి.


విజయవాడలో కృష్ణానది తీరానికి ఆనుకుని ఉన్న బెర్మ్ పార్కుకు ఉదయం, సాయంత్రం సందర్శకుల తాకిడీ అధికంగా ఉంటుంది. పార్కును ఆనుకుని బోటింగ్ పాయింట్లు, నదీ తీరంలో కాటేజీలు ఉన్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థలో అత్యంత విలువైన బెర్మ్ పార్కు స్థలాన్ని అభివృద్ధి పేరుతో తనఖా పెట్టడాన్ని నగర వాసులు వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2022-02-11T16:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising