ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: ఇంద్రకీలాద్రిపై అపచారం

ABN, First Publish Date - 2022-09-29T13:20:54+05:30

ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. పవిత్రంగా శ్రద్ధాసక్తులతో విధులు నిర్వర్తించాల్సిన కాంట్రాక్ట్‌ సంస్థ ఉద్యోగి మత్తులో జోగాడు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులను క్రమపద్ధతిలో నడిపించడానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. పవిత్రంగా శ్రద్ధాసక్తులతో విధులు నిర్వర్తించాల్సిన కాంట్రాక్ట్‌ సంస్థ ఉద్యోగి మత్తులో జోగాడు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులను క్రమపద్ధతిలో నడిపించడానికి వివిధ ప్రదేశాల్లో భద్రతా విధులకు ఎజైల్‌ సెక్యూ రిటీ ఏజెన్సీ సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ను తీసుకుంది. మహామండపం, ఇంద్రకీలాద్రి, ముఖద్వారం, ప్రధాన ఆలయం లోపల, బయట, రాజగోపురం, లిఫ్టుల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి సెక్యూరిటీ ఆఫీసర్‌(ఎస్‌వో)గా చంద్ర అనే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. శరన్నరాత్రి మహోత్సవాలు కావడంతో ఈవో భ్రమరాంబ పాత మెట్ల మార్గం వద్ద ఉన్న కార్యాలయంలో ఉంటున్నారు. చంద్ర బుధవారం ఈవో వద్దకు వచ్చి ఊగుతూ కని పించాడు. ఆయన మాట్లాడుతుంటే మద్యం వాసన రావడాన్ని గుర్తించిన, ఈవో ఆగ్రహం వ్యక్తం చేసి, అతడి గుర్తింపు కార్డును తీసుకుని, విషయాన్ని కాంట్రాక్ట్‌ సంస్థకు తెలియజేశారు. వెంటనే అతడ్ని విధుల నుంచి పంపేశారు. ఈ ఘటనతో కాంట్రాక్ట్‌ సంస్థపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చం ద్రను దుర్గగుడి విధుల నుంచి తప్పించి కొత్త వ్యక్తిని నియమిస్తామని ఏజెన్సీ ప్రతినిధులు దుర్గగుడి అధికారులకు తెలిపారు. చంద్ర మహా మం డపంలోని నాలుగో అంతస్తులో విధుల్లో ఉన్నాడు. అక్కడే మద్యం తాగాడని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-09-29T13:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising