ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో సీపీఎం ఆందోళన...అరెస్ట్

ABN, First Publish Date - 2022-04-04T16:58:37+05:30

పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ నగరంలో సీపీఎం ఆందోళనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ నగరంలో సీపీఎం ఆందోళనకు దిగింది. సోమవారం ఉదయం బందరురోడ్‌లోని ఏజీ కార్యాలయం ముట్టడికి సీపీఎం నేతలు యత్నించారు. వెంటనే పోలీసులు వారికి అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేత బాబూరావు మాట్లాడుతూ... నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్ ధరలు రెట్టింపుతో సామాన్య ప్రజలు బతక లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతో సీఎం జగన్ కూడా పన్నుల బారాలు మోపారని విమర్శించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వస్తే అరెస్ట్‌లు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. 


దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అస్యవస్త్యపాలనతో ప్రజలను పీక్కుతింటున్నాయని విమర్శలు గుప్పించారు. మోదీ కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ అస్తులను దోచి పెడుతున్నారని ఆరోపించారు. విజయవాడలో 1200 కోట్లు ఆస్తి పన్నును వసూళ్లు చేశారని, విద్యుత్ సంస్కరణలు పేరుతో 4300 కోట్లు భారం ప్రజలపై మోపారని మండిపడ్డారు. ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఇలా అయితే జగన్మోహన్ రెడ్డిపై పడేవి పూలు కాదు రాళ్లు అని అన్నారు. విద్యుత్ చార్జీల మోతతో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయమని తెలిపారు. 

Updated Date - 2022-04-04T16:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising