ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజిలెన్స్‌ అదుపులో దర్శన టికెట్ల దళారులు

ABN, First Publish Date - 2022-01-25T01:01:09+05:30

తిరుమలలో రూ.300 దర్శన టికెట్లు అధిక ధరకు విక్రయించే ఇద్దరు దళారీలను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో రూ.300 దర్శన టికెట్లు అధిక ధరకు విక్రయించే ఇద్దరు దళారీలను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడపకు చెందిన వినయ్‌, తిరుమలలో ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న వేణు ఈ నకిలీ టికెట్లు విక్రయ వ్యవహారంలో ఉన్నట్టు గుర్తించారు. అవసరమైన డేటా మార్పులు చేసి ఏడు నకిలీ టికెట్లను విక్రయించిన ట్టు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. జనవరి 23వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల స్కానింగ్‌ కౌంటర్ల వద్ద టీటీడీ విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి నకిలీ టికెట్లను గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన సైదులును విచారించగా, తమకు వేణు, వినయ్‌ అనే వ్యక్తులు ఈ నకిలీ టికెట్లను విక్రయించినట్లు తెలిపారు. వారికి గూగుల్‌పే ద్వారా రూ.5,600 క్యాష్‌, నగదు రూపంలో రూ.వెయ్యి అందించినట్లు తెలిపారు. భక్తుల ఫిర్యాదు మేరకు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ఇద్దరు దళారీలపై తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-25T01:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising