ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల పోరాటం వృథా కాలేదు: వెంకట్రామిరెడ్డి

ABN, First Publish Date - 2022-02-06T21:25:38+05:30

ఉద్యోగుల పోరాటం వృథా కాలేదని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఉద్యోగుల పోరాటం వృథా కాలేదని, ఫిట్ మెంట్ తప్ప మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల పీఆర్సీ బదులు ఐదేళ్ల పీఆర్సీని తాము సాధించుకున్నామన్నారు. హెచ్‌ఆర్‌ఎ శ్లాబుల్లో తెలంగాణతో సమానంగా సాధించుకున్నామన్నారు. 


నిన్నటి చర్చల్లో ఏడాదికి రూ. 1500 కోట్లు అదనంగా ప్రభుత్వం నుంచి రాబట్టామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం జగన్‌ది చాలా పెద్ద చేయని, తాము ఏదైనా అడిగినా కాదనరని అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి రూ. 20 వేల కోట్ల ఆదాయం తక్కువగా వచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారని, మేము ఆవేశంలో మాట్లాడినందుకు సీఎంకు క్షమాపనలు చెబుతున్నామన్నారు. పెద్ద మనసుతో ముందకు వచ్చి అదనంగా రూ 1500 కోట్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో  ఇరు వర్గాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలని, ఉద్యోగులు అర్ధం చేసుకోవాలన్నారు. మొత్తం ఎపిసోడ్‌లో ఉద్యోగులు విజయం సాధించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-02-06T21:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising