ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు అర్ధరాత్రి నుంచే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం

ABN, First Publish Date - 2022-12-31T03:49:47+05:30

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 2 వైకుంఠ ఏకాదశి, 3న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది. ధనుర్మాసం సందర్భంగా 2వ తేదీ వేకువజామున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రి 1.45 గంటల నుంచి భక్తులకు అనుమతి

మూడవసారి పదిరోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం

తిరుమల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 2 వైకుంఠ ఏకాదశి, 3న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారం తెరుచుకోనుంది. ధనుర్మాసం సందర్భంగా 2వ తేదీ వేకువజామున తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం 1.45 గంటల నుంచి భక్తులను అనుమతించి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభిస్తారు. టీటీడీ 2020 నుంచి పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈసారి కూడా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. రోజుకు దాదాపు 80 వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. దర్శనానికి వెళ్లే సమయంలో భక్తుల మధ్య తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా బారికేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు 2న ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. యధావిధిగా సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ తర్వాత ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ఊరేగిస్తారు. ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కరిణి తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు. వేకువజాము 5 నుంచి 6 గంటల మధ్య చక్రత్తాళ్వారును నాలుగు మాడవీధుల్లో ఊరేగించి వరాహస్వామి ఆలయం నుంచి పుష్కరిణి లోకి తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహిస్తారు.

11 వరకు ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్ల జారీ రద్దు

డిసెంబరు 31 నుంచి జనవరి 11వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో జారీ చేసే శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. జనవరి 1 నూతన ఏడాదితో పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే 2 నుంచి 11వ తేదీ వరకు సంబంధించిన శ్రీవాణిట్రస్టు టికెట్లను టీటీడీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌లో జారీ విధానానికి బ్రేక్‌ వేసింది. డిసెంబరు 31, జనవరి 1వ తేదీకి సంబంఽధించిన టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్ల జారీని కూడా రద్దు చేశామని టీటీడీ ప్రకటించింది.

Updated Date - 2022-12-31T03:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising