ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాంధ్రకు చేసిందేమిటి?: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-04-09T00:51:55+05:30

ఉత్తరాంధ్ర జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమిటని బీజేపీ రాష్ట్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమిటని బీజేపీ రాష్ట్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి సమీపంలో రబ్బరు డ్యాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. రూ. 40 కోట్లు ఖర్చు చేస్తే 40 వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే జంఝావతి ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమన్నారు.  ‘పోలవరానికి నిధులు ఇవ్వండి’ అంటూ కేంద్రానికి లేఖలు ఇవ్వడం మినహా చేసింది ఏమీ లేదని తప్పుబట్టారు. ఒడిశాతో ఉన్న కొద్దిపాటి వివాదంతో నిలిచిపోయిన జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు, దమ్ము లేదని సోము వీర్రాజు విమర్శించారు. 

Updated Date - 2022-04-09T00:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising