ట్రిపుల్ ఐటీల్లో సర్టిఫికెట్ల అప్‌డేషన్‌కు అవకాశం
ABN, First Publish Date - 2022-10-17T10:03:02+05:30
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి మార్కుల జాబితాలను
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మిగిలిపోయిన సీట్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి మార్కుల జాబితాలను అప్‌డేట్ చేసుకోవచ్చని ఆర్టీయూకేటీ చాన్స్‌లర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో కొందరు రిపోర్టు చేయలేదని, ఆ సీట్లను ఈ విడతలో మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తామని వివరించారు. ఇందుకోసం పదో తరగతి సవరణ మార్కులు జాబితాలుంటే ఈనెల 22 సాయంత్రం 5గంటల లోపు ఆర్జీయూకేటీ వెబ్‌సైట్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్యాంపస్ మారాలనుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Updated Date - 2022-10-17T10:03:02+05:30 IST