ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిని కూల్చకుండా జాకీలతో పైకి

ABN, First Publish Date - 2022-12-31T05:19:21+05:30

పాత డాబా ఇంటిని కూల్చకుండా లిఫ్టింగ్‌ పరిజ్ఞానంతో మూడు అడుగులు పైకి లేపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడడుగుల ఎత్తు.. మూడు లక్షలే ఖర్చు

పాత డాబా ఇంటిని కూల్చకుండా లిఫ్టింగ్‌ పరిజ్ఞానంతో మూడు అడుగులు పైకి లేపారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కురేళ్లగూడెంలోని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు నాగగోపాలరావు 12 ఏళ్ల క్రితం నిర్మించిన రెండంతస్తుల భవనం.. చుట్టూ రోడ్ల నిర్మాణంతో పల్లమైంది. ఈశాన్యం వైపు వర్షం నీరు పడమట వైపు వెళ్లడంతో ఇంటిని మూడు అడుగుల మేర పైకి లేపాల్సిన అవసరం ఏర్పడింది. నెల్లూరుకు చెందిన బిల్డింగ్‌, లిఫ్టింగ్‌, షిఫ్టింగ్‌ సంస్థను సంప్రదించగా.. సంస్థ యజమాని అనిల్‌కుమార్‌ ఇంటిని పరిశీలించి భవనాన్ని మూడు అడుగులు మేర పైకి లేపడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 210 జాకీలు, 15 మంది కూలీలతో 20 రోజులపాటు శ్రమించి శుక్రవారం భవనాన్ని పైకి లేపారు. ఇంటి యజమాని గన్ని సత్యవాణి మాట్లాడుతూ... బిల్డింగ్‌ను మూడు అడగులు పైకి లేపడానికి రూ.3 లక్షలు ఖర్చయిందని చెప్పారు. ‘ఏడేళ్లుగా ఈ రంగంలో ఉంటూ 60 ఇళ్ల ఎత్తును పెంచాం. ఈ టెక్నాలజీతో భవనం చెక్కు చెదరకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు’ అని ఇంజనీర్‌ ఎస్‌. అనిల్‌ కుమార్‌ తెలిపారు. - భీమడోలు

Updated Date - 2022-12-31T05:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising