వేడినీరు పడి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు
ABN, First Publish Date - 2022-12-15T03:10:05+05:30
అనంతపురం జిల్లా యాడికి మండలం లక్షుంపల్లి గ్రామంలో వేడినీరు మీదపడి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
యాడికి, డిసెంబరు 14: అనంతపురం జిల్లా యాడికి మండలం లక్షుంపల్లి గ్రామంలో వేడినీరు మీదపడి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన నాగార్జున, పెద్దయ్య బావ, బావమరుదులు. చిన్నారులకు స్నానం చేయించేందుకు బుధవారం సాయంత్రం బకెట్ నీటిలో హీటర్ పెట్టి వేడి చేశారు. ఆ తరువాత హీటర్‌ను ఆఫ్ చేశారు. ఈ సమయంలో నాగార్జున కూతురు చరిత (ఏడాది) ను పెద్దయ్య కుమారుడు ఆదికేశవ (4) ఎత్తుకుని ఆడుకుంటూ వేడి నీటి బకెట్‌కు తగిలి కిందపడ్డాడు. వెంటనే బకెట్‌లోని వేడినీరు ఇద్దరు చిన్నారులపై పడిం ది. దీంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం అనంతపురానికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు.
Updated Date - 2022-12-15T03:10:06+05:30 IST