ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పయ్యావుల కేశవ్ భద్రతపై ట్విస్టులు

ABN, First Publish Date - 2022-07-11T23:15:17+05:30

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) భద్రత విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. భద్రతపై గంటకో రకంగా పోలీస్ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) భద్రత విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. భద్రతపై గంటకో రకంగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. పయ్యావులకు ముందుగా భద్రత ఉపసంహరించి, ఆ తర్వాత కొనసాగిస్తున్నామని ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించారు. తనను వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమించారని.. కొత్త గన్‌మెన్ పయ్యావులకు పరిచయం చేసుకున్నారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (Reserve Inspector) స్థాయి అధికారి వచ్చి.. గన్‌మెన్లను మార్చిన విషయం తెలియజేయాలని కేశవ్ అంటున్నారు.


కొత్త పీఎస్‌వోను పరిచయం చేసిన వెంటనే.. విధుల్లో చేరాలని గన్‌మెన్‌ (Gunmen)కు పయ్యావుల సూచించారు. పీఎస్‌వోలను మార్చడంపై పోలీస్ అధికారుల పొంతన లేని సమాధానాలిస్తున్నారు. ట్రైనింగ్ కోసమే గన్‌మెన్లను వెనక్కి రప్పించామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అలాంటిదేమీ లేదని పీఎస్‌వోలు అంటున్నారు. ఈ గందరగోళం మధ్య.. భద్రతా సిబ్బంది మార్పులపై సమాచారం ఇవ్వలేదని కేశవ్ విస్మయం వ్యక్తం చేశారు. ఉన్నఫలంగా కేశవ్‌కు భద్రతా సిబ్బందిని మార్చడంపై పయ్యవుల కుటుంబీకులు, టీడీపీ (TDP) శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై సోషల్‌మీడియాలో పలువురు విమర్శలు గుప్పించారు. 

Updated Date - 2022-07-11T23:15:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising