ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉధృతంగా తుంగభద్ర

ABN, First Publish Date - 2022-07-17T01:40:53+05:30

కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. డ్యాం ఎగువన పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో 1,02,091 క్యూసెక్కులు వరద ఉండగా... సాయంత్రం 5 గంటలకు 1,18,561 క్యూసెక్కులకు చేరింది. డ్యాం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు, పూర్థిస్థాయి నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు. 1630.11 అడుగుల వద్ద 94.476 టీఎంసీలు నిల్వ చేసి... 30 గేట్లు ఎత్తి 1,52,533 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజీకి ఉదయం 1.02 లక్షల క్యూసెక్కులు చేరితే... సాయంత్రానికి 1,29,596 క్యూసెక్కులకు పెరిగింది. సుంకేసుల డ్యాం సామర్థ్యం కేవలం 1.20 టీఎంసీలే. వరదను నిల్వ చేసుకునే అవకాశం ఏమాత్రం లేకపోవడం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువ శ్రీశైలం జలాయానికి విడుదలు చేస్తున్నారు. 950.13 అడుగుల వద్ద 0.481 టీఎంసీలు నిల్వ చేసి 27 గేట్లు ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,29,096 క్యూసెక్కులు, కేసీ కాలువకు 505  క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరం చెంతనే పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర జల అందాలు తిలకించి పురజనం పులకించిపోతున్నారు. 

Updated Date - 2022-07-17T01:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising