ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD ఈవోపై అసత్య ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2022-06-16T19:46:04+05:30

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్సటెన్షన్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ చెయ్యడానికి 300 శ్రీవారి కల్యాణోత్సవం లడ్డూలను ఢిల్లీకి తరలించారంటూ కొద్దిరోజుల క్రిత్తం టీటీడీ ఈవోపై సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరిగింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలగడంతో పాటు టీటీడీ ఉద్యోగుల మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బ తిన్నెలా మెసెజ్‌ను వైరల్ చేశారంటూ పోటు అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 505(1)(b) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మెసేజ్‌ను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వారిని కచ్చితంగా అరెస్ట్ చేస్తామన్నారు. టీటీడీపై దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-16T19:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising