ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD EO Dharma Reddy కుమారుడి ఆరోగ్యం విషమం

ABN, First Publish Date - 2022-12-19T08:54:15+05:30

టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడు శివ ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉంది. హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TTD EO Dharma Reddy : టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కుమారుడు శివ ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉంది. హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. వెంటనే వెంటిలేటర్ పెట్టి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ప్రస్తుతం శివకు ఎక్మో యంత్రంతో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు చెన్నై‌లోని కావేరి హాస్పిటల్‌కు చేరుకున్నారు. కుమారుడి పరిస్థితి చూసి ధర్మారెడ్డి సృహ తప్పి పడిపోయారు. డాక్టర్స్ చికిత్స అందించడంతో మళ్లీ కోలుకున్నారు. ఈ నెల 26న ప్రముఖ పారిశ్రామిక వేత్త శేఖర్ రెడ్డి కుమర్తెతో శివకు వివాహం జరగనుంది. ఇటీవలే వివాహ కార్యక్రమం కోసం ముంబై నుంచి శివ చెన్నైకు వచ్చారు. ఈ క్రమంలోనే తన వివాహ ఆహ్వాన పత్రికలు పంచుతుండగా శివకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే స్నేహితులు ఆయనను కావేరి ఆసుపత్రిలో చేర్చారు. ధర్మారెడ్డితో పాటు శేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Updated Date - 2022-12-19T08:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising