ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD Chairman: దాతల సాయంతో తిరుమలలో పార్కుల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-09-23T14:39:28+05:30

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఆహ్లాదపర్చేందుకు దాతల సహాయంతో తిరుమలలోని పార్కులను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఆహ్లాదపర్చేందుకు దాతల సహాయంతో తిరుమల (Tirumala)లోని పార్కులను అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... 64 లక్షలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పార్కును అభివృద్ధి చేసి నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. తిరుమలలోని మరో నాలుగు పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ నెల 27న సీఎం జగన్ (Jagan mohan reddy) రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 28న నూతన పరకామణి మండపాన్ని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభిస్తారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఘాట్ రోడ్డులో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రికల్ బస్సులను కూడా సీఎం జగన్ (AP CM) ప్రారంభిస్తారన్నారు. డిసెంబర్ చివరికి శ్రీనివాస సేతు నిర్మాణాన్ని పూర్తి చేసి.. జనవరి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD Chairman) వెల్లడించారు. 

Updated Date - 2022-09-23T14:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising