ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు టీచర్ల బదిలీ ఉత్తర్వులు?

ABN, First Publish Date - 2022-10-17T09:29:57+05:30

ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న బదిలీల షెడ్యూలు విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎనిమిదేళ్ల సర్వీసుకు అంగీకారం

ఎట్టకేలకు షెడ్యూలు విడుదలకు రెడీ


అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న బదిలీల షెడ్యూలు విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సోమవారం బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. బదిలీలకు గరిష్ట సర్వీసును ఎనిమిదేళ్లకు పెంచింది. దీనికి సీఎంవో అంగీకారం తెలపగా ఈ ఫైలు పాఠశాల విద్య శాఖ కమిషనరేట్‌కు చేరింది. దీంతో బదిలీల షెడ్యూలు విడుదలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కాగా ఈ ఏడాది బదిలీలు రకరకాల మలుపులు తిరిగాయి. బదిలీలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సర్వీసును ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించింది. దీనిపై టీచర్లలో వ్యతిరేకత వ్యక్తమైనా దానిపై ముందుకెళ్ళింది. కానీ అదిగో ఇదిగో అంటూ షెడ్యూలు మాత్రం విడుదల చేయలేదు. ఇలా రెండు నెలలకు పైగా కాలం గడిపిన ప్రభుత్వం చివరికి ఐదేళ్ల నిర్ణయంపై వెనకడుగు వేసి ఎప్పటిలాగే ఎనిమిదేళ్ల సర్వీసు ప్రామాణికంగా తీసుకుంది.

Updated Date - 2022-10-17T09:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising