ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మ నిద్రపోతోందని..

ABN, First Publish Date - 2022-03-13T08:36:59+05:30

అమ్మ ఈ లోకం విడిచి పోయినా.. నిద్రపోతోందనుకున్నాడు. తల్లి మరణించిన విషయం ఆ పదేళ్ల పిల్లవాడికి అర్థం కాలేదు. లేస్తుందిలే అని అనుకుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతదేహం పక్కనే 4 రోజులు పదేళ్ల బాలుడు

ఇంట్లో ఉన్నవి తింటూ స్కూల్‌కు వెళ్లివచ్చిన వైనం

మేనమామ రావడంతో విషయం వెలుగులోకి

తిరుపతిలో విషాదకర సంఘటన 


తిరుపతి (నేరవిభాగం), మార్చి 12: అమ్మ ఈ లోకం విడిచి పోయినా.. నిద్రపోతోందనుకున్నాడు. తల్లి మరణించిన విషయం ఆ పదేళ్ల పిల్లవాడికి అర్థం కాలేదు. లేస్తుందిలే అని అనుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం చూసినా అమ్మ లేవలేదు. ఒంట్లో బాగా లేనపుడు ఇలాగే పడుకుంటుందని భావించాడు. ఫ్రిజ్‌లో ఉన్నవేవో బాక్స్‌లో సర్దుకుని స్కూలుకి వెళ్లిపోయాడు. అలా మూడు రోజులు గడిచింది. నాలుగో రోజు మేనమామ ఫోన్‌ చేస్తే.. అమ్మ నాలుగు రోజులుగా లేవకుండా నిద్ర పోతోందని చెప్పాడు. ఆయన అనుమానంతో వచ్చి చూడటంతో ఆమె మరణించిన విషయం తెలిసింది. శనివారం తిరుపతి విద్యానగర్‌లో ఈ విషాదకర సంఘటన వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా ఎల్లమరాజుపల్లికి చెందిన కోదండరెడ్డి కుమార్తె టి.రాజ్యలక్ష్మి (41) కుటుంబ సమస్యల కారణంగా నాలుగేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నారు. ఫిజిక్స్‌లో డాక్టరేట్‌ చేసిన ఆమె ఏడాది క్రితం వరకు బెంగుళూరులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. ఏడాదిగా తిరుపతిలో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. తన కుమారుడు శ్యామ్‌కిశోర్‌ (10)తో కలిసి ఉంటున్నారు. ఈ నెల 8వ తేదీ రాత్రి రాజ్యలక్ష్మి వాంతి చేసుకుని, బెడ్‌ పక్కనే బోర్లా పడిపోయారు. కొడుకు శ్యామ్‌కిశోర్‌ ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు.


నిద్రపోతోందని భావించి, మూడు రోజుల పాటు ఉన్నదేదో తింటూ స్కూలుకు వెళ్లి వచ్చాడు. నాలుగో రోజు ఆమె నుంచి దుర్వాసన వచ్చింది. స్కూలుకు వెళ్లాక వాంతి చేసుకున్నాడు. అయినా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇంటి విషయాలు బయట ఎవరికీ చెప్పరాదని అమ్మ చెప్పిన మాటలే ఇందుకు కారణం. తనకు ఆరోగ్యం బాగాలేకపోతే మారాం చేయకుండా ఉన్నదేదో తినాలని చెప్పేవారట. విసిగించకుండా ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లకూడదని చెప్పారట. ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ ఆ బాలుడితో అనునయంగా మాట్లాడుతూ ఈ వివరాలు తెలుసుకున్నారు. ఇంట్లో తల్లి, బాలుడు తప్ప ఎవరూ లేకపోవడంతో ఆమె మరణించిన విషయాన్ని వెంటనే తెలుసుకోలేకపోయారు. తల్లి మృతదేహం పక్కనే ఆ పిల్లవాడు 4 రోజులు గడిపాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని తరలించారు. బాలుడిని మేనమామ ఆశ్రయంలో ఉంచారు. అమ్మ నిద్రపోతోందని అమాయకంగా చెబుతున్న ఆ బాలుడి మాటలకు చుట్టుపక్కలవాళ్లు కన్నీటిపర్యంతమయ్యారు. 

Updated Date - 2022-03-13T08:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising