ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tomorrow ఏపీలో అతిభారీ వర్షాలు

ABN, First Publish Date - 2022-07-11T02:39:29+05:30

దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతున్నది. దీనిపై సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: దక్షిణ ఒడిశా, ఉత్తరకోస్తా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతున్నది. దీనిపై సముద్రమట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఇంకా గుజరాత్‌ నుంచి ఉత్తర కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు, పడమర ద్రోణి విస్తరించాయి. అలాగే రాజస్థాన్‌ నుంచి మధ్య భారతం, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నది. వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణకోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది

Updated Date - 2022-07-11T02:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising