ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు నేడులో నాణ్యత డొల్ల

ABN, First Publish Date - 2022-12-15T03:39:11+05:30

నెల్లూరులోని దర్గామిట్ట జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం మెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మాణంలో ఉన్న మెట్లు కుప్పకూలిన వైనం

ఘటనపై మాట్లాడవద్దంటూ హెచ్‌ఎంపై వైసీపీ నేతల ఒత్తిళ్లు

నెల్లూరు (విద్య), డిసెంబరు 14: నెల్లూరులోని దర్గామిట్ట జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం మెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కాంక్రీటు బీమ్స్‌లో నుంచి ఇనుప చువ్వలు బయటకు పొడుచుకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనుల్లోని డొల్ల తనాన్ని ఈ ఘటన ఎత్తిచూపుతోంది. ఈ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అప్రమత్తమైన అధికారులు కూలిన నిర్మాణం ఎవరి కంటా పడకుండా వేగంగా పనులు చేపట్టారు. కూలిన స్లాబు శిఽథిలాలను తొలగించి వాటి స్థానంలో పాత చెక్కముక్కలను వేశారు. ఇనుప చువ్వలను సరిచేసి పూతపనులు ప్రారంభించారు. మీడియాకు సమాచారం అంది పాఠశాల వద్దకు వెళ్లేలోపు అక్కడ అంతా ప్రశాంతంగా పనులు జరుగుతున్నట్లు సిబ్బంది వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై సంబంధిత ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నిస్తే... ‘‘నేనేమీ చూడలేదు. స్థానిక వైసీపీ కార్పొరేటర్‌, ఎమ్మెల్యే సోదరుడు నన్ను ఏమీ మాట్లాడవద్దని చెప్పారు’’ అని స్పష్టం చేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులను నిలదీశాయి. ‘‘ఘటనా స్థలాన్ని పరిశీలిస్తాం. పూర్తివివరాలు తెలుసుకుంటాం. ఉన్నతాధికారులతో చర్చించి నివేదికలు అందచేస్తాం’’ అని అన్నారు. కాగా, జనసేన నాయకులు మెట్లు కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Updated Date - 2022-12-15T03:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising