ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-12-16T23:57:10+05:30

జిల్లాలోని బీసీ వర్గాల చిరకాల స్వప్నమైన బీసీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 16: జిల్లాలోని బీసీ వర్గాల చిరకాల స్వప్నమైన బీసీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నేడు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరుకానున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తల లింగమూర్తి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోవిందు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పల శివయాదవ్‌, గౌరవ సలహాదారు ఏవీఆర్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని బీసీ సంక్షేమం సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప నగర పాత రిమ్స్‌లో ప్రభుత్వం కేటాయించిన 20 సెంట్ల స్థలంలో ఈనెల 17వ తేదీన శం కుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ అవినా్‌షరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, నగర మేయర్‌ సురే్‌షబాబు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, యువజన రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్‌ హాజరుకానున్నట్లు వెల్లడించారు. కావున జిల్లాలోని బీసీ సంఘాల సభ్యులు, నాయకులు తప్పక హాజరుకావాలని వారు పిలుపినిచ్చారు.

Updated Date - 2022-12-16T23:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising