కుళ్లాయప్పకు ఇండియన్ ఫ్యాషన్ అవార్డు
ABN, First Publish Date - 2022-12-15T03:15:33+05:30
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలు బొమ్మల కళాకారుడు దళవాయి కుళ్లాయప్పను మరో అవార్డు వరించింది.
తోలుబొమ్మల కళాకారుడికి ఢిల్లీలో ప్రదానం
ధర్మవరం రూరల్, డిసెంబరు 14: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలు బొమ్మల కళాకారుడు దళవాయి కుళ్లాయప్పను మరో అవార్డు వరించింది. ప్రస్తుత ఫ్యాషన్ రంగానికి అనుగుణంగా తోలుబొమ్మలను డిజైన్ చేసినందుకు ఇండియన్ ఫ్యాషన్ అవార్డు(ఐఎ్‌ఫఏ)ను ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని ఆన్‌దాన్‌హోటల్‌లో మంగళవారం రాత్రి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఐఎ్‌ఫఏ ప్రతినిధులు కుళ్లాయప్పకు పురస్కారం అందజేసి సత్కరించారు. ప్రాచీన కళను ప్రస్తుత తరానికి తగినట్టు కుళ్లాయప్ప తీర్చిదిద్దారని ఐఎ్‌ఫఏ ప్రతినిధులు కొనియాడారు. కుళ్లాయప్పను తోటి కళాకారులు అభినందించారు. కుళ్లాయప్ప ఇటీవల కేంద్ర చేనేత, జౌళి శాఖ నుంచి జాతీయ హస్తకళల పురస్కారం అందుకున్నారు.
Updated Date - 2022-12-15T03:15:34+05:30 IST