ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Smugler Siva: రెండు నెలల క్రితం తృటిలో తప్పించుకున్నాడు.. ఇప్పుడు ట్రాప్ చేయడంతో దొరికిపోయాడు..

ABN, First Publish Date - 2022-09-18T04:24:06+05:30

కొంత కాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఎర్రచందనం కీలక స్మగ్లర్ శివను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: కొంత కాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఎర్రచందనం కీలక స్మగ్లర్ శివను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన 42 కేసుల్లో నిందితుడిగా ఉన్న స్మగ్లర్ శివకుమార్ ఎలియాస్ శివ(42)ను అరెస్టు చేశారు. నిందితుడి కోసం మూడు జిల్లాల పోలీసులు గాలించి కేసును ఛేదించారు.


అయితే నిందితుడు శివకు కొంతమంది బడా స్మగ్లర్లు, విదేశీ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు నెలల క్రితం శివ తృటిలో తప్పించుకున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టారు.  స్మగ్లింగ్ చేస్తున్న వాహనం, కొన్ని ఎర్రచందనం దుంగలను అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. అయితే శివ తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు గాలించారు.


తాజాగా రేణిగుంట, కడప రహదారిలో ట్రాప్ చేసి శివను పట్టుకున్నారు. తనకు ఎర్రచందనంతో సంబంధం లేదని తప్పించకోబోయిన శివను టాస్క్ ఫోర్సు బృందం నిశితంగా విచారించింది.  కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన శివశంకర్ ఎలియాస్ శివ(42)అని అంగీకరించాడు. విచారణలో తనతో సంబంధాలు ఉన్న కొన్ని పేర్లను కూడా తెలిపారు. శివ సహచరులు జాకీర్, లాల్ బాషాల కోసం తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. రెండుసార్లు శివ పీడీయాక్టు కింద జైలుకు వెళ్లాడు.  శివ ద్వారా బడా స్మగ్లర్లను పట్టుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-09-18T04:24:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising