ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupati: రేపు తిరుపతికి సీజేఐ

ABN, First Publish Date - 2022-08-18T01:19:46+05:30

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (Justice Nv Ramana) ఈనెల 18, 19 తేదీల్లో తిరుపతి (Tirupati)లో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (Justice Nv Ramana) ఈనెల 18, 19 తేదీల్లో తిరుపతి (Tirupati)లో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad) నుంచీ బయల్దేరి రాత్రి 7.20 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు. 19న శుక్రవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానంగా మహాత్మాగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాదు బయల్దేరి వెళతారు. తిరుపతిలో మహాత్ముని ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) నిర్వహించనున్నారు. ఆయన ఆహ్వానం మేరకే ప్రధాన న్యాయమూర్తి తిరుపతి వస్తున్నట్టు తెలిసింది. వెంకటేశ్వరస్వామి పట్ల అచంచలమైన భక్తివిశ్వాసాలున్న ఎన్వీ రమణ తరచూ తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో పదవీ విరమణకు ముందు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారని సమాచారం.

Updated Date - 2022-08-18T01:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising