పూర్తయిన ఇళ్లు ఇవ్వడానికి మూడేళ్లా..: అచ్చెన్న
ABN, First Publish Date - 2022-08-04T08:02:06+05:30
పూర్తయిన ఇళ్లు ఇవ్వడానికి మూడేళ్లా..: అచ్చెన్న
‘రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం టీడీపీ ప్రభుత్వం టిడ్కో కార్పొరేషన్ ద్వారా లక్షల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మించింది. మేం దిగిపోయే సమయానికి ఇవి 90శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తిచేసి వాటిని లబ్ధిదారులకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మూడేళ్లు పట్టింది. మేం కట్టిచ్చిన వాటిని ప్రజలకు పంచడానికి మూడేళ్లు కావాలా’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన దీనిపై ట్విటర్‌లో స్పందించారు. తాము రూ.4,600 కోట్లతో టిడ్కో ఇళ్లు కట్టించి ఇస్తే మళ్లీ వాటిపై రూ.4 వేల కోట్ల అప్పు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్: కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సీఎం జగన్ రెడ్డి తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకొంటూ స్టిక్కర్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేద వ్యాస్ బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో విమర్శించారు.
Updated Date - 2022-08-04T08:02:06+05:30 IST