ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మహత్య చేసుకున్న రైతులు వీరే

ABN, First Publish Date - 2022-08-04T09:14:10+05:30

ఆత్మహత్య చేసుకున్న రైతులు వీరే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయం అందించాలని హెచ్‌ఆర్‌ఎ్‌ఫ, ఆర్‌ఎస్వీ డిమాండ్‌

తిరుపతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో సొంత భూమి ఉండి.. ఆత్మహత్య చేసుకున్న రైతులకూ ప్రభుత్వ పరిహారం అందలేదని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎ్‌ఫ), రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌ఎస్వీ) తెలిపాయి. ‘పట్టాదారు పాస్‌బుక్‌ ఉండి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏ ఒక్కరికైనా పరిహారం ఇవ్వలేదని నిరూపిస్తారా?’ అని ఇటీవల సత్యసాయి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్‌ విసిరిన సవాల్‌ను తాము స్వీకరించి, గ్రామాల్లో సర్వే జరిపామని తెలిపాయి. శ్రీకాళహస్తి, నగరి, తిరుపతి డివిజన్లలోని ఆరు గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న 8 మంది రైతుల కుటుంబాలను, గ్రామస్థులను కలిసి వివరాలు సేకరించామని తెలుపుతూ ఆ వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. కేవీబీపురం మండలం కర్లపూడిలో టి.వెంకటేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకోగా, అతని భార్య సుబ్బులమ్మ అనారోగ్యంతో చనిపోయారు. వారి కుమార్తె అనిత అధికారులను కలిస్తే.. ‘మీకు భూమి తక్కువగా ఉంది. బోర్లువేస్తే అంత ఖర్చవుతుందా? మీ నాన్నకు ఒక్కరికే నష్టం వచ్చిందా?’ అని ప్రశ్నించి, మానసిక క్షోభకు గురిచేశారని తెలిపారు. శ్రీనివాసపురంలో డి.ఏలుమలై ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబ సభ్యులు వారం రోజుల తర్వాత అధికారులను కలిస్తే, సంఘటన జరిగిన 24 గంటల్లోపే రావాలని, ఇప్పుడు విచారణ సాధ్యంకాదని తిప్పిపంపేశారన్నారు.  కాలికాపురంలో రఘుపతి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎమ్మెల్యే రోజా పరామర్శించి రెండేళ్లవుతున్నా..వారికి న్యాయం జరగలేదన్నారు. 


పరిహారం అందని రైతు కుటుంబాలు

1. ఎం.రఘుపతి 

(కాళికాపురం, విజయపురం మండలం)

2. ఎం.భాస్కర్‌ మందడి 

(వేణుగోపాలపురం, పుత్తూరు మండలం)

3. ఎస్‌.భాపాలయ్య

(టీకేఎంపేట, కార్వేటినగరం మండలం)

4. వెంకటేశ్వర రెడ్డి (కర్లపూడి)

5. ఏలుమలై (శ్రీనివాసపురం)

6. కె.మోహనాచారి (ఆరె)

7. సి.వేణు (ఆరె)

Updated Date - 2022-08-04T09:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising