ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ పోలీసుల ఇష్టారాజ్యం

ABN, First Publish Date - 2022-10-17T09:53:35+05:30

విశాఖ పోలీసుల ఇష్టారాజ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీకి ఒక రూలు, విపక్షాలకు మరో రూలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖలో పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ వారికి ఒక రూల్‌, ప్రతిపక్షాలకు మరో రూల్‌ అన్నవిధంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకులకు చట్టాలు, నిబంధనలు వర్తించవు. అదే విపక్షాలు అయితే...చిన్న ఘటనకు కూడా బెయిల్‌ లభించకుండా తీవ్ర శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 1నుంచి 30వరకు నగరంలో పోలీస్‌ చట్టం సెక్షన్‌ 30 అమలులో ఉందంటూ ఈస్ట్‌ ఏసీపీ హర్షిత ఆదివారం నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి పవన్‌కల్యాణ్‌కు నోటీసు ఇచ్చారు. ర్యాలీకి అనుమతి లేదని స్పష్టంచేశారు. హోటల్‌ నుంచి అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో జరిగే జనవాణి సభకు కారులో నేరుగా వెళ్లాలని, మధ్యలో ప్రజలకు కనిపిస్తూ అభివాదం చేయకూడదని స్పష్టం చేశారు. సెక్షన్‌ 30 అమల్లో ఉన్నప్పటికీ.. విశాఖ గర్జన పేరుతో వారం రోజులుగా వైసీపీ నాయకులు ప్రతి వార్డులో ద్విచక్రవాహన ర్యాలీలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి, శనివారం ర్యాలీ, బీచ్‌రోడ్డులో బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతులు ఎలా ఇచ్చారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. చట్టం ఒక్కో పార్టీకి ఒక్కోలా ఉంటుందా? అని నిలదీస్తున్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. పవన్‌కల్యాణ్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన బస చేసే హోటల్‌ వరకు ర్యాలీగా వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


ఈ మేరకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టు చెబుతున్నాయి. పవన్‌ గత పర్యటలను దృష్టిలో పెట్టుకుని తగిన బందోబస్తు చర్యలు చేపట్టడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారు. ‘విశాఖ గర్జన’ పేరుతో వైసీపీ నాయకులు నిర్వహించిన ర్యాలీకి భద్రత కల్పించడానికి సుమారు 2వేల మంది పోలీసులను ఉపయోగించారు. పవన్‌ ర్యాలీకి బందోబస్తులో మాత్రం ఇందులో పదో వంతు కూడా కనిపించలేదు. విమానాశ్రయానికి వచ్చిన పవన్‌ అభిమానుల్లో కొందరు స్తంభాలు, హోర్డింగులు ఎక్కారు. తగినంతమంది పోలీసులను నియమించి ఉంటే అభిమానులను విమానాశ్రయంలోకి రాకుండా జాతీయ రహదారి వద్దనే నిలువరించేవారు. పవన్‌ను విమానాశ్రయం నుంచి బయటకు పంపడానికి కనీసం రోప్‌ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదని జనసేన అధికార ప్రతినిధి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. దీంతో విమానాశ్రయం నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న ఎన్‌ఏడీ జంక్షన్‌కు చేరడానికి రెండు గంటలు పట్టిందన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు పోలీసులు ఇష్టానుసారం వ్యవహరించారని ఆరోపించారు. విమానాశ్రయంలో మంత్రులపై దాడి జరిగిందని ప్రచారం జరగడం, పవన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావడం, ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో అధికార పార్టీ పెద్దలు తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరును తప్పుబట్టారు.


విధి నిర్వహణలో వైఫల్యం చెందారని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, మంత్రులపై దాడి చేసిన వారితోపాటు ఆ పార్టీ నాయకులపై కేసులు పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. దీంతో పోలీసులు అప్పటికప్పుడు ఫిర్యాదులు తీసుకొని, కేసులు నమోదుచేశారు. పవన్‌ పర్యటనకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసిన నాయకులతోపాటు, నగరంలో చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహించే వారందరిపైనా కేసులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో 28 మంది పేర్లు రాసి, ఇంకా పలువురు అని పేర్కొన్నారు.  

Updated Date - 2022-10-17T09:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising