ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులు మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-03-23T02:13:44+05:30

రాష్ట్రానికి మూడు రాజధానులు అనేవి తమ పార్టీ, ప్రభుత్వ విధానమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులు అనేవి తమ పార్టీ, ప్రభుత్వ విధానమని మంత్రి బొత్సా సత్యనారాయణ స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణకు కట్టుబడి  తాము ఉన్నామన్నారు. సమయాన్ని బట్టి సభలో మూడు రాజధానుల బిల్లు పెడతామన్నారు. మూడు రాజధానుల విధానమే తమ నిర్ణయమని ఆయన ప్రకటించారు. తాము మొదటి నుండి అదే చెప్తున్నామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో అని ఆయన అన్నారు. ఏదైనా పాజిటివ్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీలతో చర్చించామన్నారు. అన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని సంఘాల వారికి నాలుగో తేదీన రమ్మని చెప్పామన్నారు. ఎవరు ఎప్పుడు కోరితే అప్పుడు టైం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ స్కూల్సులో టీచర్ల సంఖ్య పెంచాలని అడిగారన్నారు. పీఎఫ్ వంటి సమస్యలు అడిగారని, వాటన్నింటినీ పరిష్కారిస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-03-23T02:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising