ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణంలో లక్ష్యాన్ని చేరుకోవాలి

ABN, First Publish Date - 2022-09-23T08:16:51+05:30

ఇళ్ల నిర్మాణంలో లక్ష్యాన్ని చేరుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రులు, అధికారులతో సమీక్షలో జగన్‌

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. ప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిస్తుంది. రాష్ట్రంలోని గిరిజన, వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించండి. ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయండి’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌ గురువారం గృహ నిర్మాణ, రెవెన్యూ, పురపాలక - పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న ఇళ్లతోపాటు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్షించారు. ఇప్పటికే పనులు పూర్తయిన టిడ్కో ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇళ్లస్థలాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి 90 రోజుల్లోగా పట్టాలు అందించే కార్యక్రమంపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు చేసుకున్నవారిలో ఇప్పటికే 96.8 వేల మందికి పట్టాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని సీఎంకు చెప్పారు. ఇప్పటికే పనులు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, వచ్చే డిసెంబరు నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని వివరించారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠ శాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు నేడు పనులపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణపై కీలక ఆదేశాలు ఇచ్చారు. ‘‘స్కూల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి గురుకుల పాఠశాలల్లో అకడమిక్‌ వ్యవహరాలు పర్యవేక్షణ తీసుకురావాలి. మండలాల్లో అకడమిక్‌ వ్యవహారాలు చూస్తున్న ఎంఈవోలకు సంబంధిత మండలంలోని గురుకుల పాఠశాల అకడమిక్‌ బాధ్యతలు అప్పగించాలి. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి’ అని సీఎం అన్నారు. గురుకుల పాఠశాలల్లో మూడు విడతలుగా నాడు-నేడు పనులు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రెండు విడ తలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో నాడు-నేడు పనులు చేయాలన్నారు.  


Updated Date - 2022-09-23T08:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising