ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP High Court: రుషికొండపై తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా

ABN, First Publish Date - 2022-07-19T17:44:11+05:30

రుషికొండ పర్యవరణ ఉల్లంఘనలపై హైకోర్టులో విచారణ జరుగుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రుషికొండ(Rushikonda) పర్యవరణ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టు(AP High Court)లో విచారణ జరుగుతుంది. రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని  వైసీపీ నర్సాపురం రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam RajU) పిటీషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో2 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు  దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు(Supreme Court) సూచనల మేరకు రఘురామ పిటీషన్‌ను అనుమతించాలని  న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టులో వాదించారు. ఉమేష్ చంద్ర వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటీషన్‌ను సీజే నేతృత్వంలోని ధర్మాసనం  విచారణకు అనుమతినిచ్చింది. రఘురామరాజు తరపున రుషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రఘురామ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా  సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుషికొండ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2022-07-19T17:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising