ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విభజన సమస్యలపై ముగిసిన కేంద్ర హోంశాఖ కీలక సమావేశం..

ABN, First Publish Date - 2022-09-27T20:09:08+05:30

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ (Central Home Ministry) కీలక సమావేశం ముగిసింది. దాదాపు ప్రతి అంశంలోనూ ఏపీ (AP)కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ (Central Home Ministry) కీలక సమావేశం ముగిసింది. దాదాపు ప్రతి అంశంలోనూ ఏపీ (AP)కి ఈ సమావేశంలో షాక్ తగిలింది. ఏపీ లేవనెత్తిన ఏ అంశానికి కూడా తెలంగాణ అధికారులు ఒప్పుకున్నది లేదు. ఇక రైల్వే జోన్ (Railway Zone) ఏర్పాటు సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. రైల్వే జోన్ నిర్ణయాన్ని కేబినెట్‌ (Cabinet)కు వదిలేయాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. రాజధానికి మరో రూ.వెయ్యి కోట్లు కావాలని ఏపీ కోరింది. ఇప్పటికే ఇచ్చిన రూ.1500 కోట్ల వివరాలు ఇవ్వాలని కేంద్రం తెలిపింది. 


సమావేశంలో మరో కొత్త విషయాన్ని ఏపీ అధికారులు (AP officials) లేవనెత్తారు. శివరామకృష్ణన్ కమిటీ (Sivaramakrishnan Committee) రూ.29వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసిందన్నారు. అందుకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని ఏపీ కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదు. వెనుకబడిన 7 జిల్లాలకు నిధులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. షీలా బిడే కమిటీ సిఫార్సుల (Sheila Bidde Committee Recommendations)పై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. 


షీలా బిడే కమిటీ సిఫార్సులను తెలంగాణ ఒప్పుకోవడం లేదని హోంశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ అంగీకరించకపోయినా.. హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చని ఏపీ తెలిపింది. న్యాయ నిపుణుల (Legal professionals) సలహాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఏపీ లేవనెత్తిన ప్రతి అంశాన్ని తెలంగాణ అధికారులు వ్యతిరేకించారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ (AP Finance Corporation) సహా పలు సంస్థల వ్యవహారం.. కోర్టు పరిధిలో ఉన్నాయని తెలంగాణ అధికారులు (Telangana officials) వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలున్నాయన్న ఏపీ పేర్కొంది. ఎలాంటి నిర్ణయం లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది.

Updated Date - 2022-09-27T20:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising