మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: చంద్రబాబు
ABN, First Publish Date - 2022-10-07T08:48:31+05:30
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 6(ఆంధజ్ర్యోతి): బాపట్ల సూర్యలంక బీచ్‌లో విహారానికి వెళ్లిన విజయవాడకు చెందిన ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘‘మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబాలకు జరిగిన నష్టం అపారం. పండుగ వేళ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. పర్యాటక కేంద్రాల వద్ద ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు.
Updated Date - 2022-10-07T08:48:31+05:30 IST