ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీమకుర్తిలో పావురం కలకలం.. గూఢచర్యం కోసం వినియోగించారా?

ABN, First Publish Date - 2022-01-05T16:30:17+05:30

చీమకుర్తిలో ఓ పావురం కలకలం రేపింది. కాళ్లకి చైనాకి సంబంధించిన ట్యాగ్‌తో ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం : చీమకుర్తిలో ఓ పావురం కలకలం రేపింది. కాళ్లకి చైనాకి సంబంధించిన ట్యాగ్‌తో ఉన్న పావురాన్ని స్థానికులు గుర్తించారు. పావురం కుడికాలుకి పసుపు రంగుతో ఉన్న ట్యాగ్‌ను గమనించారు. ట్యాగ్‌పై AIR 2207 అనే కోడ్ నంబర్ ఉంది. అయితే ఇది చైనా పావురం అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


కాగా.. ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో సైతం ఇదే తరహా పావురాలు స్థానికులకు చిక్కాయి. వీటి కాళ్లకు సైతం కోడ్ నంబర్లతో కూడిన రబ్బర్ ట్యాగ్‌లు ఉంటడం గమనార్హం. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని రవురెక్కలా ప్రాంతంలోనూ.. మంగళవారం కేంద్రపడ జిల్లా మార్ సగై పోలీస్ స్టేషన్‌ పరిధి దశరథపుర్‌లో మరోటి దొరికాయి. వీటిలో ఒక పావురం కాలికి వీహెచ్ఎఫ్, వైజాగ్, 19742021 అని ముద్రించి ఉండగా.. మరో పావురం కాలికి చైనా అక్షరాలతో కూడిన అల్యూమినియం ట్యాగ్ ఉన్నాయి. అయితే ఈ పావురాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పంపిస్తున్నారు? ఎవరైనా గూఢచర్యం కోసం వినియోగిస్తున్నారా? లేదంటే ఆకతాయిలా పనా? అనేది తెలియాల్సి ఉంది.  


Updated Date - 2022-01-05T16:30:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising