ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2022-10-07T08:16:09+05:30

అమరావతితోనే రాష్ట్రాభివృద్ధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోతులు పూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు నిర్మిస్తారా? 

ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించాలి.. మహాపాదయాత్ర రైతుల విజ్ఞప్తి 

భైరాగి మఠం వేణుగోపాలస్వామి ఆలయంలో రైతుల ప్రమాణం 

రోడ్లపై వరినాట్లు వేస్తూ నిరసన.. పెంటపాడు నుంచి పెద అమిరం వరకూ 

రెండు రోజుల్లో 30 కిలోమీటర్లు నడక


భీమవరం, పెంటపాడు, గణపవరం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘రహదారులపై గోతులు పూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు నిర్మిస్తారా? అమరావతి రాజధానితో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గోదావరి జిల్లాల వాసులు విజ్ఞతతో ఆలోచించాలి’ అంటూ రైతులు విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని సాధన లక్ష్యంగా వరు చేపట్టిన మహా పాదయాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగింది. 24వ రోజు బుధవారం పెంటపాడు నుంచి ప్రారంభమై కె.పెంటపాడు, యానాలపల్లి, పరిమళ్ల, కొమ్మర, యలగపల్లి మీదుగా వరదరాజపురం, గణపవరం, సరిపల్లి వరకు 15 కి.మీ. మేర యాత్ర నిర్వహించారు. 25వ రోజు గురువారం గణపవరం మండలం సరిపల్లి నుంచి మొదలై ఆరేడు గ్రామం మీదుగా కోలమూరు, పామలపర్రు, ఉండి వరకు 15కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. రాత్రి ఉండి మండలం పెద అమిరంలో రైతులు బస చేశారు. పాదయాత్రకు స్థానికులు నీరాజనాలు పలికి, రైతులపై పూలవర్షం కురిపించారు. అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారు. రాజధానికి పొలాలు ఇచ్చిన నిజమైన రైతులమంటూ పశ్చిమగోదావరి జిల్లాలో పేరొందిన భైరాగి మఠం వేణుగోపాలస్వామి దేవాలయంలో రైతులు ప్రమాణం చేశారు. తాము ఫేక్‌ రైతులమనుకుంటే మంత్రి కొట్టు కూడా దేవుని వద్ద ప్రమాణం చేయాలన్నారు. రహదారిపై వర్షం నీరు చేరిన గుంతల్లో వరినాట్లు వేస్తూ అమరావతి రైతులు నిరసన తెలిపారు. 


అమరావతిని మార్చలేరు: చినరాజప్ప 

రాజమహేంద్రవరం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతే మన రాజధాని. దానిని ఎవరూ మార్చలేరు. ఈ విషయం సీఎం జగన్‌కూ తెలుసు. కోర్టులు కూడా అదే చెప్పాయి. కానీ జగన్‌ రాజకీయ పబ్బం కోసం ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి, చిచ్చుపెట్టడానికి కుట్రలు చేస్తున్నారు’ అని మాజీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. మహాపాదయాత్రకు మద్దతుగా రాజమహేంద్రవరంలో గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వ హించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ఇంకా ఒక్క ఏడాదే, జనం జగన్‌ను తిప్పికొట్టి బంగాళాఖాతం లో కలిపేస్తారని హెచ్చరించారు.  సమావేశంలో టీడీపీ,  జనసేన, బీజేపీ నేతలు, అమరావతి జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T08:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising