ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రౌన్‌ కీర్తిని అజరామరం చేసిన జానమద్ది

ABN, First Publish Date - 2022-10-17T10:25:27+05:30

బ్రౌన్‌ కీర్తిని అజరామరం చేసిన జానమద్ది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంసుందర్‌


కడప (కల్చరల్‌), అక్టోబరు 16: తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన సీపీ బ్రౌన్‌ స్మారకంగా గ్రంథాలయ నిర్మాణం చేసి బ్రౌన్‌ కీర్తిని అజరామరం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్‌ జానమద్ది హనుమచ్చాస్త్రి అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్‌ బండారు శ్యాంసుందర్‌ అన్నారు. జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో ఆదివారం కడప నగరంలోని సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలోని బ్రౌన్‌ శాస్త్రి సమావేశ మందిరంలో డాక్టర్‌ జానమద్ది హనుమచ్చాస్త్రి 98వ జయంతి, దశమ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జానమద్ది రచయితగా సాహితీసేవ చేస్తూనే మరోవైపు బ్రౌన్‌ గ్రంథాలయ అభివృద్ధికి తుదిశ్వాస వరకు అవిరళ కృషి చేశారన్నారు. ఎంతో మంది కవులను, రచయితలను ఈ గ్రంథాలయానికి ఆహ్వానించడం ద్వారా గ్రంథాలయ కీర్తిని దశదిశలా వ్యాపింపచేశారని తెలిపారు.  అనంతరం 2022 సంవత్సరానికి గాను ప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్‌ జి.వి.పూర్ణచంద్‌, అక్షరపల్లకి సాహితీ సంస్థ నిర్వాహకులు ఎం.శ్రీనివాస ఆచార్యలకు జానమద్ది పురస్కారాలను బహుకరించారు.

Updated Date - 2022-10-17T10:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising