ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

badvel: చిన్నారిని బలి తీసుకున్న అక్రమసంబంధం

ABN, First Publish Date - 2022-12-31T05:57:17+05:30

తల్లి వివాహేతర సంబంఽధం కొడుకును బలితీసుకుంది. సహజీవనం చేస్తున్న ఆమె ప్రియుడే ఆ చిన్నారి పాలిట యముడయ్యాడు. నాన్న కావాలని ఏడుస్తున్నాడని గొంతు నులిమి హత్య చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లి, ఆమె ప్రియుడు అరెస్టు.. బద్వేలులో ఘటన

బద్వేలు, డిసెంబరు 30: తల్లి వివాహేతర సంబంఽధం కొడుకును బలితీసుకుంది. సహజీవనం చేస్తున్న ఆమె ప్రియుడే ఆ చిన్నారి పాలిట యముడయ్యాడు. నాన్న కావాలని ఏడుస్తున్నాడని గొంతు నులిమి హత్య చేశాడు. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు డీఎస్పీ వంశీధర్‌ గౌడ్‌ కథనం మేరకు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మారుతి నాయక్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండే వాడు. ఇతనికి 14 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన కవితతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు బిందు (4) ఉన్నారు. చాలాకాలం ప్రొద్దుటూరులో నివాసం ఉన్న వీరు ఇటీవల ఖాజీపేటకు మకాం మార్చారు. మారుతి నాయక్‌కు పరిచయస్తుడైన వినోద్‌ తరచూ వీరి ఇంటికి వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో కవిత, వినోద్‌ల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం కొడుకును, ఎనిమిదేళ్ల కూతురిని తీసుకుని కవిత వినోద్‌తో వెళ్లిపోయింది. వీరు బద్వేలు పట్టణంలోని రూపరాంపేటలో ఉన్నట్టు మారుతినాయక్‌కు తెలిసి వచ్చి కొడుకు కోసం ఆరా తీశాడు. కవిత పొంత న లేని సమాధానం చెప్పడంతో గురువారం బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వినోద్‌, కవితలను విచారించగా... రోజూ రాత్రిపూట నాన్న నాన్న అని ఏడుస్తుంటే రెండు వారాల క్రితం గొంతు నులిమి హత్యచేశామని వినోద్‌ అంగీకరించాడు. మృతదేహా న్ని తాము మొదట అద్దెకు ఉన్న ఇంటిముందే పూడ్చామని చెప్పగా శుక్రవారం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. వినోద్‌, కవితలను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2022-12-31T11:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising