ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2022-12-31T03:32:30+05:30

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఆరు పేపర్లతోనే పరీక్ష నిర్వహించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈసారి ఆరు పేపర్లే.. సైన్స్‌లో ఒకటే

తొలిసారిగా రోజు మార్చి రోజు పరీక్ష

ఉదయం 9.30 నుంచి 12.45 వరకూ

15న ముగియనున్న రెగ్యులర్‌ పరీక్షలు

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఆరు పేపర్లతోనే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురే్‌షకుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. గతేడాది వరకూ సెలవులు వస్తే మినహా వరుస రోజుల్లో పరీక్షలు జరిగేవి. అయితే ఇప్పుడు తొలిసారిగా రోజు విడిచి రోజు పరీక్షల విధానం ప్రవేశపెట్టారు. ప్రతి రెండు పరీక్షల మధ్య కనీసం ఒకరోజు ఖాళీ ఉండేలా షెడ్యూల్‌ రూపొందించారు. అలాగే గతేడాది వరకూ సైన్స్‌ పరీక్షను రెండు రోజులు జరిపి మొత్తం ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ పరీక్ష ఒకరోజు మాత్రమే జరగనుంది. దీంతో మొత్తం పేపర్ల సంఖ్య ఆరుకే పరిమితమైంది. రెగ్యులర్‌ పరీక్షలన్నీ 15వ తేదీతోనే ముగుస్తుండగా, 17, 18 తేదీల్లో ఓరియంటల్‌ ఎస్‌ఎ్‌ససీ, ఒకేషనల్‌ పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే ప్రథమ భాష పేపర్‌-2 (కాంపోజిట్‌ కోర్సు) పరీక్ష 9.30నుంచి 11.15 వరకు, ఎస్‌ఎ్‌ససీ ఒకేషనల్‌ కోర్సు థియరీ పరీక్ష 9.30 నుంచి 11.30 వరకు జరగనున్నాయి. ఇప్పటి వరకూ 6,60,859 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నిర్దేశిత రుసుము కంటే అదనంగా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

తేదీ సబ్జెక్టు మార్కులు

ఏప్రిల్‌ 3 ప్రథమ భాష 100

ప్రథమ భాష-1 (కాంపోజిట్‌ కోర్సు) 70

ఏప్రిల్‌ 6 ద్వితీయ భాష 100

ఏప్రిల్‌ 8 ఇంగ్లిష్‌ 100

ఏప్రిల్‌ 10 గణితం 100

ఏప్రిల్‌ 13 సైన్స్‌ 100

ఏప్రిల్‌ 15 సోషల్‌ స్టడీస్‌ 100

ఏప్రిల్‌ 17 ప్రథమ భాష-2 (కాంపోజిట్‌ కోర్సు) 30

ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1 100

ఏప్రిల్‌ 18 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2 100

ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ) 40, 30

Updated Date - 2022-12-31T03:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising