ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొల్లాపల్లి మం. రావులాపురంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-06-04T21:58:37+05:30

బొల్లాపల్లి మండలం రావులాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు గ్రామానికి తీసుకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: బొల్లాపల్లి మండలం రావులాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు గ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు నిర్వహంచేందుకు జల్లయ్య బంధువులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, బ్రహ్మరెడ్డిని అనుమతిస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని మృతుడి బంధువులు చెబుతున్నారు. రోడ్డుపై బైఠాయించి టీడీపీ శ్రేణులు, మృతుడి బంధువుల ఆందోళనకు దిగారు. అయితే రావులాపురానికి టీడీపీ నేతలు రాకుండా హౌస్‌అరెస్ట్‌ చేశారు. 


దుర్గి మండలంలో జంగమహేశ్వరపురానికి చెందిన మల్లయ్య, కంచర్ల బక్కయ్య, జాలయ్య (35)లు టీడీపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరగడంతో వీరంతా గ్రామం విడిచి వెళ్లి గురజాల మండలం మాడుగులలో ఉంటున్నారు. మల్లయ్య కుమారుడుకి ఈ నెల 11న పెళ్లి నిశ్చయం కావడంతో నగదు కోసం వీరు శుక్రవారం దుర్గి వచ్చారు. అక్కడ బ్యాంకులో రూ.5 లక్షలు డ్రా చేసుకొని రావులపాలెం బయలుదేరారు.


 వారంతా మించాలపాడు సమీపంలోకి రాగానే అప్పటికే కాపుకాచి ఉన్న వైసీపీకి చెందిన 15 మంది ఒక్కసారిగా రాడ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు.  ఈ దాడిలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. దాడి సమయంలో వారితో ఉన్న రూ.5 లక్షలు అపహరణకు గురైనట్లు సమాచారం. క్షతగాత్రులను మాచర్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో జాలయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట తరలించారు. అక్కడి ప్రైవేటు వైద్యశాలకు వెళ్లగానే జాలయ్య మృతిచెందాడు

Updated Date - 2022-06-04T21:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising