ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్బిట్రేషన్‌కు అంగీకారమేనని హైకోర్టుకు చెప్పండి

ABN, First Publish Date - 2022-12-16T01:53:48+05:30

మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నవయుగ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసిన వ్యవహారంలో ఆర్బిట్రేషన్‌కు అంగీకారమేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు తెలియజేయాలంటూ ఆ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం పోర్టు ఒప్పందంపై నవయుగకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నవయుగ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రాష్ట్రప్రభుత్వం రద్దు చేసిన వ్యవహారంలో ఆర్బిట్రేషన్‌కు అంగీకారమేనని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు తెలియజేయాలంటూ ఆ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోర్టు నిర్మాణ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలుచేస్తూ నవయుగ తొలుత హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీనిపై ఆ సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సెక్షన్‌ 7 కింద ఆర్బిట్రేషన్‌ అప్లికేషన్‌ను ఎందుకు దాఖలు చేయలేదని నవయుగ సంస్థను ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టే ఆర్బిట్రేటర్‌ను నియమించాలని నవయుగ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోరగా.. ఆర్బిట్రేషన్‌కు అంగీకరిస్తున్నట్లు హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-16T01:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising