ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దులో ప్రయాణికుల కష్టాలు

ABN, First Publish Date - 2022-04-07T09:13:58+05:30

జాతీయ రహదారిపై గరికపాడులోని అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మూడు కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలంటూ తెలంగాణలో అధికార పార్టీ(టీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రహదారుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరికపాడు వద్ద 3 కి.మీ.లు నిలిచిన వాహనాలు

తెలంగాణలో రహదారుల దిగ్బంధమే కారణం


జగ్గయ్యపేట రూరల్‌, ఏప్రిల్‌ 6: జాతీయ రహదారిపై గరికపాడులోని అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మూడు కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలంటూ తెలంగాణలో అధికార పార్టీ(టీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో  బుధవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. దీంతో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు రామాపురం జంక్షన్‌లో ఉదయమే జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ నేపథ్యంలో నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి స్వీయ పర్యవేక్షణలో చెక్‌పోస్టు వద్దే వాహనాలను నిలిపివేశారు. ఆంధ్ర నుంచి తెలంగాణ వైపు వెళ్లే కార్లను జగ్గయ్యపేట మండలం బలుసుపాడు, అన్నవరం గ్రామాల మీదుగా తెలంగాణలోకి పంపారు. భారీ వాహనాలను సరిహద్దు ఇవతలే నిలిపివేశారు. జగ్గయ్యపేట-కోదాడ వెళ్లే రెండు రాష్ర్టాల బస్సులు, ఆటోలు, బైకులను కూడా అనుమతించలేదు. దీంతో ప్రజలు, కూలీలు, వైద్యం కోసం వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రత, కనీసం తాగునీరు, కూర్చునేందుకు చెట్లు కూడా లేకపోవటంతో అవస్థలు పడ్డారు. బస్సుల్లో హైదరాబాద్‌ వైపు వెళ్లేవారు ఏదోలా వెళ్లాలని ప్రయత్నించినా తెలంగాణ పోలీసులు పాలేటి వద్ద అడ్డుకున్నారు.

Updated Date - 2022-04-07T09:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising