ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండ్లకమ్మ గేట్లు పరిశీలించిన టీడీపీ బృందం

ABN, First Publish Date - 2022-09-06T09:40:29+05:30

గుండ్లకమ్మ గేట్లు పరిశీలించిన టీడీపీ బృందం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ


ఒంగోలు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్మోతి): ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ గేట్లు దెబ్బతిని ప్రాజెక్టులోని మూడు టీఎంసీల నీరు సముద్రంపాలు కావడానికి నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని టీడీపీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. తక్షణం పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గుండ్లకమ్మ జలాశయాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు సోమవారం సందర్శించారు. గుండ్లకమ్మ గేట్లు, నీరు లేక వెలవెలపోతున్న జలశయాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గుండ్లకమ్మ దెబ్బతినడానికి గత ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబు కారణమని మంత్రి అంబటి చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు నిర్వహణ, గేట్ల మరమ్మతులు ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబుపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.

Updated Date - 2022-09-06T09:40:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising