ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీల లేఖ

ABN, First Publish Date - 2022-03-22T15:51:05+05:30

ఏపీలో నాసిరకం మద్యం.. హానికారకమైన మద్యం సరఫరా చేస్తున్నారంటూ మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో నాసిరకం మద్యం.. హానికారకమైన మద్యం సరఫరా చేస్తున్నారంటూ మండలి ఛైర్మన్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు. జంగారెడ్డి గూడెం మరణాలు సహా ఏపీలో సరపరా అవుతోన్న మద్యం నాణ్యతపై చర్చ జరపాలని ఎమ్మెల్సీలు కోరారు. లేఖతో పాటు ల్యాబ్ రిపోర్ట్ జత చేశారు. 


లేఖలో ఏమన్నారంటే...

సారాక్షసి, జే బ్రాండ్ల నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఉభయ సభల్లో ప్రభుత్వం చర్చకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జే బ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ఆరోపించారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డి గూడెంలోనే వారం రోజుల్లో 28 మందికి పైగా సారా తాగేవాళ్లు మృతి చెందారని తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనూ జే బ్రాండ్ ప్ర‌మాద‌క‌ర మ‌ద్యం తాగిన వారు చికిత్స పొందుతున్నారన్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని, మ‌ద్య‌ నిషేధం హామీతో అధికారంలోకొచ్చిన ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం వ్యాపారం ఆరంభించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏకంగా సుమారు రూ.24 వేల కోట్లు మ‌ద్యంపై ఆదాయం రాబ‌డుతోందన్నారు. పిచ్చిమ‌ద్యం అత్య‌ధిక ధ‌ర‌ల‌కి అమ్ముతుండ‌డంతో నిరుపేద‌లు సారాకి అల‌వాటు ప‌డి ప్రాణాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-22T15:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising